మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 11:50:18

ఆ సంస్థ‌కి ధ‌న్య‌వాదాలు తెలిపిన‌ న‌టి శ్ర‌ద్దా క‌పూర్ : వీడియో వైర‌ల్‌

ఆ సంస్థ‌కి ధ‌న్య‌వాదాలు తెలిపిన‌ న‌టి శ్ర‌ద్దా క‌పూర్ :  వీడియో వైర‌ల్‌

సోష‌ల్ మీడియా ఎప్పుడూ మూగ‌జీవాల‌తో నిండి ఉంటుంది. అవి ఎల్ల‌ప్పుడూ మ‌న ముఖంలో చిరున‌వ్వును తెప్పిస్తుంది . మ‌న‌కు సంతోషాన్నిచ్చే జంతువుల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంటుంది. ఇటీవ‌ల ప్ర‌మాదంలో ఉన్న పిల్లిని ఓ వ్య‌క్తి ర‌క్షించిన వీడియోను బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి శ్ర‌ద్దా క‌పూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్ప‌డు అది సోష‌ల్ వైర‌ల్‌గా మారింది.

త‌న ఇంటి చుట్టూ విచ్చ‌ల‌విడిగా తిరిగే పిల్లుల‌కి అత్య‌వ‌స‌రంగా వైద్య స‌హాయం అవ‌స‌ర‌మ‌ని శ్ర‌ద్దా వెల్ల‌డించారు. న‌టి స‌హాయం కావాల‌ని కోరిన‌ప్పుడు 'వ‌ర‌ల్డ్ ఫ‌ర్ ఆల్ ఎనిమ‌ల్ అడాప్షన్'‌కు చెందిన న‌ర్సింగ్, రాహుల్ స‌హాయం అందించారు. చాలా ప్రేమ‌గా ఆ పిల్లుల‌‌ను చేర‌దీసినందుకు శ్ర‌ద్దా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ వీడియోలో ఒక అత‌ను పిల్ల‌ని ప్రేమ‌గా పిలిచి బ‌య‌ట‌కు తీస్తున్న‌ట్లు చూపించారు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 


logo