ముంబై (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ 35 అడుగుల విగ్రహం కూలిన ఘటనపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలు జోడ్ మారో(చెప్పుతో కొట్టండి) పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. మహా వికాస్ అఘాడీ అగ్రనేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, నానా పటోలే ఇందులో పాల్గొన్నారు.
విగ్రహం కూలిపోయేలా నిర్మించి శివాజీని అవమానించిన వారికి గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ చెప్పిన క్షమాపణలోని అహంకారాన్ని గమనించారా? అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అంతులేని అవినీతికి ఈ ఘటనే తార్కాణమని శరద్ పవార్ పేర్కొన్నారు.