Hit And Run Case : మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఏక్నాథ్ షిండే సర్కార్ నిర్వాకంతోనే ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని విపక్షాలు భగ్గుమన్నాయి.
వర్లి హిట్ అండ్ రన్ కేసులో న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నామని శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికీ ఇతర సహాయం లేదా ఉపశమనం అవసరం లేదన్నారు. మరి మిహిర్, రాజేష్ షాకు ఏం జరుగుతుందో వారిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు వర్లి హిట్ అండ్ రన్ కేసులో మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే సర్కార్ లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె విమర్శలు గుప్పించారు.
షిండే సర్కార్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో మాఫియాలు చెలరేగాయని ఆరోపించారు. అతని (నిందితుడు మిహిర్ షా) రక్తంలో డ్రగ్స్ ఉండి ఉంటాయి, అతను రక్త పరీక్ష అనంతరం పోలీసుల ఎదుటలొంగిపోయాడని అన్నారు. మిహిర్ షాను పోలీసులు అరెస్టు చేయలేదని చెప్పారు. షిండే సర్కార్ రాష్ట్రంలో డ్రగ్ మాఫియాలకు ఊతం ఇస్తోందని, ప్రభుత్వ తీరు ఇలా ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతోనే పరిస్ధితి ఇలా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నుల కోసం షిండే సర్కార్ పనిచేస్తో్ందని, పేదలకు ఏమైనా జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోదని దుయ్యబట్టారు.
Read More :