Hit And Run Case : మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
ముంబైలోని (Mumbai) బాంద్రాలో (Bandra) ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు (Speeding car)అదుపుతప్పి టోల్ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది.