Loksabha Elections 2024 : కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుందని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో పార్టీకి లభించే సీట్ల సంఖ్యపై గుబులు చెందే పార్టీ ఏదైనా ఉంటే అది కాషాయ పార్టీనే అన్నారు.
వారు అంతకుముందు 400కుపైగా సీట్లు సాధిస్తామని చెబుతుండేవారని, కానీ ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదని అన్నారు. బీజేపీ నేతలకు తమకు కనీసం 300 సీట్లు కూడా దక్కవని తెలిసిపోయిందని అన్నారు. చివరికి 200 సీట్లు దాటడం కూడా వారికి కష్టమేనని శశి థరూర్ అన్నారు.
తమకు ఈసారి మెరుగైన సంఖ్యలో సీట్లు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని, వారు తమకు బాసటగా నిలుస్తూ తమలో ఉత్తేజం నింపుతున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయ సంఖ్యలో స్ధానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Pavithra Jayaram | సినీ ఇండస్ట్రీలో విషాదం.. త్రినయిని సీరియల్ నటి దుర్మరణం