Pavithra Jayaram | సినీ ఇండస్ట్రీలో విషాదం.. త్రినయిని సీరియల్ నటి దుర్మరణం
Pavithra Jayaram | సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. త్రినయిని సీరియల్‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది.
Pavithra Jayaram | సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. త్రినయిని సీరియల్‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి(బి) గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించింది. కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో పవిత్ర జయరాం బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, సహ నటుడు చంద్రకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కాగా, పవిత్ర జయరామ్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. పెద్దగా చదువుకోకపోవడంతో ఆమె హౌస్ కీపర్‌గా, సేల్స్ గర్ల్‌గా, లైబ్రరీ అసిస్టెంట్‌గా చిన్న చిన్న పనులు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. ఆ పరిచయంతో సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కన్నడలో రొబో ఫ్యామిలీ అనే సీరియల్‌తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. నిన్నే పెళ్లాడతా సీరియల్‌తో తెలుగులో అవకాశం దక్కించుకుంది. త్రినయిని సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

