Bomb Threats | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats) ఆందోళన కలిగిస్తున్నాయి. పది రోజుల క్రితం దేశరాజధాని ఢిల్లీలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని పలు స్కూల్స్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
బుధవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో గల పలు ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. పాఠశాల భవనాల్లో పేలుడు పదార్థాలు ఉంచినట్లు ఆగంతకులు హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాఠశాలల వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. విద్యార్థులను బయటకు పంపి విస్తృతంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. బాంబు బెదిరింపులతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
tourist visas | చైనీయులకు టూరిస్ట్ వీసాల జారీ ప్రక్రియ పునఃప్రారంభం