Air India | విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical Issue) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖతార్ రాజధాని దోహా (Doha) బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో (Air India Express Flight) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత విమానం వెనక్కి తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పైలట్లు, సిబ్బంది సహా 188 మంది ప్రయాణికులతో కూడిన విమానం IX 375 బుధవారం ఉదయం 9:07 గంటల సమయంలో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం (Calicut Airport) నుంచి దోహాకు బయల్దేరింది. అయితే, టేకాఫ్ అయిన తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ ముందు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత అంటే ఉదయం 11:12 గంటలకు విమానం కాలికట్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానం క్యాబిన్ ఏసీలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదని, ముందు జాగ్రత్త ల్యాండింగ్ అని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి తెలిపారు. మధ్యాహ్నం తర్వాత ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read..
tourist visas | చైనీయులకు టూరిస్ట్ వీసాల జారీ ప్రక్రియ పునఃప్రారంభం
Vice President | ధన్ఖడ్ రాజీనామా.. ఉపరాష్ట్రపతి రేసులో నితీశ్, థరూర్..?