tourist visas | అరుణాచల్ ప్రదేశ్‌లోని గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా చైనా పౌరులకు జారీ చేసిన పర్యాటక వీసాలను భారత్ (India) సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దాదాపు ఐదేళ్ల తర్వాత చైనీయులకు పర్యాటక వీసాల (tourist visas to Chinese) జారీ ప్రక్రియను పునఃప్రారంభించనున్నట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం తాజాగా ప్రకటించింది. జులై 24 నుంచి చైనా పౌరులకు పర్యాటక వీసాలు జారీ చేయనున్నట్లు తెలిపింది.
గల్వాన్ లోయలో 2020లో జరిగిన సైనిక ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్న విషయం తెలిసిందే. దీంతో చైనాపై పలు ఆంక్షలు విధించింది. వందలాది చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించింది. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం ఇరు దేశాలు సంబంధాలను మెరుగుపరుచుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లఢఖ్ సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం, నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరణ, కైలాస మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం వంటి విషయాల్లో రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.
Also Read..
Dubai Ruler | సామాన్యులతో కలిసి పబ్లిక్ ట్రామ్‌లో ప్రయాణించిన దుబాయ్ పాలకుడు.. వీడియో వైరల్
Vice President | ధన్‌ఖడ్ రాజీనామా.. ఉపరాష్ట్రపతి రేసులో నితీశ్, థరూర్..?