Dubai Ruler | సాధారణంగా దేశ పాలకులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రయాణాలు సాగిస్తుంటారు. ఏదైనా ప్రాంత సందర్శనకు వెళ్లాలన్నా అధికారులు పది రోజులు ముందుగానే ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేస్తుంటారు. అయితే, దుబాయ్ పాలకుడు (Dubai Ruler) అందుకు విరుద్ధంగా పబ్లిక్ ట్రామ్ (Public Tram)లో ప్రయాణించిన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు.
దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ (Sheikh Mohammed bin Rashid Al Maktoum) తాజాగా పబ్లిక్ ట్రామ్‌లో ప్రయాణించారు. ట్రామ్ స్టేషన్ సందర్శనకు వచ్చిన ఆయన.. అధికారులతో మాట్లాడారు. అనంతరం రద్దీగా ఉన్న ట్రామ్‌లో సామాన్యుడిగా ప్రయాణించారు. అందులో ఉన్న ప్రయాణికులు పాలకుడిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. షేక్ మొహమ్మద్ ట్రామ్‌లో ఓ పక్కన కూర్చొని ఉన్న దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు దుబాయ్ పాలకుడి సింప్లిసిటీని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ ఇలా ఎలాంటి హడావుడి లేకుండా సామాన్యులతో కలిసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించడం ఇదేమీ మొదటి సారి కాదు. 2023లో ఓసారి దుబాయ్ మెట్రోలో ప్రయాణించి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు.
Dubai commuters were in for a surprise when His Highness Sheikh Mohammed bin Rashid Al Maktoum, Ruler of Dubai, was spotted riding the Dubai Tram during an unannounced visit. #NewsofBahrain #News #Bahrain #NOBDigital #Dubai pic.twitter.com/5IXoZc0dLJ
— Ashen Tharaka (@AshenTharakaG) July 22, 2025
Also Read..
Vice President | ధన్‌ఖడ్ రాజీనామా.. ఉపరాష్ట్రపతి రేసులో నితీశ్, థరూర్..?