Passports | శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో మెరుగుపడిన భారత్ ర్యాంక్.. 59 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ
Passports | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల (worlds most powerful passports) జాబితాలో భారత్ (India) స్థానం గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగుపడింది.
Passports | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల (worlds most powerful passports) జాబితాలో భారత్ (India) స్థానం గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగుపడింది. గత ఏడాది 80వ స్థానంలో ఉండగా.. ఈసారి మూడు స్థానాలు మెరుగుపడి 77వ స్థానానికి చేరింది. అయితే, వీసా రహితంగా (Visa Free Entry) ప్రయాణించగల దేశాల సంఖ్య మాత్రం 62 నుంచి 59కి తగ్గింది. మలేసియా, ఇండోనేసియా, మాల్దీవులు, థాయ్‌లాండ్ వంటి దేశాలు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తుండగా, శ్రీలంక, మకావు, మయన్మార్ వంటి కొన్ని దేశాలు భారతీయులకు వీసా ఆన్ అరైవల్ (Visa on Arrival) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్యస్థానాల ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Henley Passport Index) 2025 ఈ ర్యాంకింగ్స్‌ను ఇచ్చింది. మొత్తం 199 దేశాల్లో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో సింగపూర్ పాస్‌పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ సారి సింగపూర్ మాత్రమే టాప్ ర్యాంక్ సాధించింది. ఈ దేశ పాస్పోర్టుతో 193 దేశాలకు వీసా అవసరం లేకుండానే ప్రయాణించొచ్చు.
ఇక ఈ జాబితాలో జపాన్, దక్షిణ కొరియా దేశాలు రెండోస్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 190 దేశాలను చుట్టిరావొచ్చు. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్లు మూడో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణాలు సాగించొచ్చు. ఆస్ట్రియా, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్వీడన్ సంయుక్తంగా 4వ స్థానంలో నిలిచాయి. న్యూజిలాండ్, గ్రీస్, స్విట్జర్లాండ్ 5వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఆదేశ పాస్పోర్టుతో కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది.
Also Read..
India – Pak War | భారత్-పాక్ వివాదంపై పాతపాటే ఎత్తుకున్న అమెరికా.. దీటుగా జవాబిచ్చిన భారత్
Vice President | ధన్‌ఖడ్ రాజీనామా.. ఉపరాష్ట్రపతి రేసులో నితీశ్, థరూర్..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

