Road Accident | విజయదశమి రోజున హర్యానా (Haryana) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కైతాల్ (Kaithal) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
జిల్లాలోని ముండ్రై (Mundrai) గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీగ్ గ్రామానికి చెందిన కొంతమంది దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన బాబా రాజ్‌పురి మేళాలో పాల్గొనేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కార్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులతో సహా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఏడుగురు మృతదేహాలను కాలువ నుంచి బయటకు తీశారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 12 ఏళ్ల బాలిక కోసం గాలింపు చేపడుతున్నారు.
Also Read..
Boeing | సమ్మె ఎఫెక్ట్.. 17 వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన బోయింగ్ సంస్థ
MS Dhoni | హాలీవుడ్ యాక్టర్లా ధోనీ.. తలా కొత్త హెయిర్ స్టైల్ చూశారా..?
Nayab Singh Saini | ఈనెల 17న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న ప్రధాని..!