సోమవారం 25 జనవరి 2021
National - Dec 04, 2020 , 13:09:26

మ‌హారాష్ట్ర మండ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీకి షాక్‌..

మ‌హారాష్ట్ర మండ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీకి షాక్‌..

హైద‌రాబాద్‌:  మ‌హారాష్ట్ర శాస‌న మండ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీకి షాక్ త‌గిలింది.  ఆ రాష్ట్రంలో ఆరు సీట్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క సీటులో మాత్ర‌మే బీజేపీ నెగ్గింది.  శివ‌సేన‌-ఎన్సీపీ కూట‌మి నాలుగు సీట్ల‌ను కైవ‌సం చేసుకోగా.. ఓ సీటును ఇండిపెండెంట్ అభ్య‌ర్థి గెలుచుకున్నారు. అయితే శివ‌సేన ఈ ఎన్నిక‌ల్లో ఒక్క సీటును కూడా గెలిచే అవ‌కాశాలు లేవు.    ప్ర‌స్తుతం కూట‌మి భాగ‌స్వామి నాలుగు సీట్ల‌లో విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్నాయి. అమ‌రావ‌తిలో శివ‌సేన అభ్య‌ర్థి ఓట‌మి పాల‌య్యారు. అయితే గ్రాడ్యుయేట్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన నాగ‌పూర్‌లో బీజేపీ ఓడిపోవ‌డం దారుణం. గ‌తంలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ స్థాన‌మైన నాగ‌పూర్‌లో ఈ సారి బీజేపీ ప‌రాజ‌యం పాలైంది. మ‌హారాష్ట్ర‌లో ఫ‌డ్న‌వీస్‌, పార్టీ చీఫ్ చంద్ర‌కాంత్ పాటిల్‌లు పుణెలో ప్ర‌చారం చేసినా.. అక్క‌డ శివ‌సే కూట‌మి అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. మండలి ఫ‌లితాల‌పై మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్ స్పందించారు.  మండ‌లి ఫ‌లితాలు అంచ‌నాల‌కు త‌గిన‌ట్లు లేవ‌ని ఫ‌డ్నవీస్ అన్నారు. మేం చాలా సీట్లు ఊహించాం, కానీ ఒక్క‌టే గెలిచామ‌న్నారు.   


logo