బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 12:24:12

ముంబై మురికివాడ‌ల్లో 57 శాతం మందికి క‌రోనా యాంటీబాడీలు

ముంబై మురికివాడ‌ల్లో 57 శాతం మందికి క‌రోనా యాంటీబాడీలు

హైద‌రాబాద్‌: ముంబైలోని మురికివాడ‌ల్లో సుమారు 57 శాతం మందికి క‌రోనా వైర‌స్ సోకి ఉంటుంద‌ని ఓ స‌ర్వే అభిప్రాయ‌ప‌డింది.  ఆ న‌గ‌రంలోని సుమారు ఏడువేల మందిపై మెడిక‌ల్ స‌ర్వే చేప‌ట్టారు. ఆ స‌ర్వే ఆధారంగా మురికివాడ‌ల‌కు సంబంధఃలేని దాదాపు  16 శాతం మంది న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు క‌రోనా వైర‌స్ సోకి ఉంటుంద‌న్న అభిప్రాయానికి వ‌చ్చారు.  సీరోలాజిక‌ల్ స్టడీ ఆధారంగా ఈ అంచ‌నా వేశారు. ఈ నెల ఆరంభంలో రెండు వారాల పాటు ర్యాండ్ శ్యాంప్లింగ్ ద్వారా ఈ ప్ర‌క్రియ చేప‌ట్టారు. మ‌న‌షి శ‌రీరంలో ఉన్న యాంటీబాడీల ఆధారంగా సీరో స్ట‌డీ జ‌రుగుతుంది. ర‌క్తాన్ని ప‌రీక్షించిన డాక్ట‌ర్లు ఆ ర‌క్తంలో రోగ‌నిరోధ‌కాలు ఎంత శాతం ఉన్నాయో సీరో స్ట‌డీలో తేలుస్తారు.  అంటే మురిక‌వాడ‌ల్లోని 57 శాతం మందిలో క‌రోనా యాంటీబాడీలు ఉన్న‌ట్లు గుర్తించారు.

ప్ర‌స్తుతం ముంబైలో క‌రోనా కేసులు ల‌క్ష దాటాయి. దేశంలో ఉన్న కేసుల్లో ఏడు శాతం ఇక్క‌డే ఉన్నాయి. ఈ న‌గ‌రంలోనే ఆరు వేల మంది వైర‌స్‌తో మృతిచెందారు. ముంబైలో మొత్తం 1.2 కోట్ల జ‌నాభా ఉన్న‌ది. దాంట్లో 65 శాతం మంది మురికివాడ‌ల్లోనే నివ‌సిస్తుంటారు. న‌గ‌ర శివార‌ల్లో మ‌రో 60 శాతం మంది జీవిస్తుంటారు.  నీతిఆయోగ్‌, గ్రేట‌ర్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, టాటా రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్‌లు సంయుక్తంగా సీరో స్ట‌డీ చేశాయి. మూడు మున్సిప‌ల్ వార్డుల నుంచి శ్యాంపిళ్ల‌ను సేక‌రించారు. అయితే మ‌హిళ‌ల్లో ఎక్కువ శాతం యాంటీబాడీలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఎక్కువ శాతం మందిలో ఎటువంటి ల‌క్ష‌ణాల‌ను గుర్తించ‌లేదు.
logo