IPS Officer | హర్యాణా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి (IPS Officer) ఆత్మహత్య చేసుకున్నారు. రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన చండీగఢ్ (Chandigarh)లో మంగళవారం చోటు చేసుకుంది.
చండీగఢ్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కన్వర్దీప్ కౌర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో హర్యాణా సీనియర్ ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్ (Puran Kumar) సెక్టార్ 11లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు (IPS Officer Shoots Himself). సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థిలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పురాన్ కుమార్ భార్య అమన్ పి కుమార్ ఓ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆమె అధికారిక పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లారు. రేపు సాయంత్రానికి తిరిగి రానున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Air India | కొలంబో నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. తిరుగు ప్రయాణం రద్దు
Crocodile | మహిళను నదిలోకి లాక్కెళ్లిన మొసలి.. షాకింగ్ వీడియో
Snow | మంచు అందాలతో పర్యాటకులను ఆహ్వానిస్తోన్న గుల్మార్గ్.. ఫొటోలు వైరల్