Air India | ఎయిర్ ఇండియా (Air India) విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొలంబో నుంచి చెన్నై (Colombo to Chennai) వచ్చిన ఫ్లైట్‌ను పక్షి ఢీ కొట్టింది (bird hit). చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టారు.
విమానం 158 మంది ప్రయాణికులతో కొలంబో నుంచి చెన్నైకి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయిన తర్వాత పక్షి ఢీ కొన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఇంజినీర్లు తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన నేపథ్యంలో విమానం తిరుగు ప్రయాణాన్ని సంస్థ రద్దు చేసింది. ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసి 137 మంది ప్రయాణికులను కొలంబోకు పంపినట్లు సంబంధిత అధికారి వెల్లడించారు.
Also Read..
Crocodile | మహిళను నదిలోకి లాక్కెళ్లిన మొసలి.. షాకింగ్ వీడియో
Snow | మంచు అందాలతో పర్యాటకులను ఆహ్వానిస్తోన్న గుల్మార్గ్.. ఫొటోలు వైరల్
Karur Stampede | కరూర్ బాధిత కుటుంబాలతో వీడియో కాల్లో మాట్లాడిన విజయ్