న్యూఢిల్లీ : పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఓ చెట్టు ఎక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన హై-ప్రొఫైల్ కాంప్లెక్స్‌లో భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది.
అధికారుల కథనం ప్రకారం చొరబాటుదారుడు రైల్ భవన్ వైపు నుంచి గోడ దూకి కొత్త పార్లమెంట్ భవనంలోని గరుడ ద్వారం వద్దకు చేరుకున్నాడు. భద్రతా సిబ్బంది వెంటనే అతడిని గమనించి అదుపులోనికి తీసుకున్నారు. అతడి గుర్తింపును, చొరబాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి అతడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.