దేశంలో మంకీపాక్స్ అలర్ట్
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీపాక్స్ భారత్‌ను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా దేశంలో రెండో కేసు కూడా నమోదైంది. కేరళలోనే రెండోది కూడా వెలుగుచూడటం గమనార్హం. కన్నూర్‌కు చెందిన 31 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ నిర్థారణ అయిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం పేర్కొన్నది
- కేరళలోనే రెండో కేసు నమోదు
- దుబాయ్ నుంచి వచ్చిన బాధితుడు
న్యూఢిల్లీ, జూలై 18: ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీపాక్స్ భారత్‌ను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా దేశంలో రెండో కేసు కూడా నమోదైంది. కేరళలోనే రెండోది కూడా వెలుగుచూడటం గమనార్హం. కన్నూర్‌కు చెందిన 31 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ నిర్థారణ అయిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం పేర్కొన్నది. బాధిత రోగి ఈనెల 13న దుబాయ్ నుంచి కర్ణాటకలోని మంగళూరులో దిగాడు. తర్వాత వ్యాధి లక్షణాలతో ఓ దవాఖానలో చేరాడు. శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపగా.. మంకీపాక్స్ సోకినట్టు తేలిందని అధికారి పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం యూఏఈ నుంచి కేరళకు వచ్చిన కొల్లాం జిల్లాకు చెందిన వ్కక్తిలో మంకీపాక్స్ తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేయండి
మంకీపాక్స్ కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అన్ని విమానాశ్రయాలు, పోర్టుల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఎయిర్‌పోర్టులు, పోర్టుల హెల్త్ అధికారులతో సమీక్ష నిర్వహించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

