Indians evacuated | సుడాన్ నుంచి భారత్‌కు రెండో బ్యాచ్.. ముంబై చేరిన 246 మంది భారతీయులు
Indians evacuated | సుడాన్ నుంచి భారతీయల తరలింపులో ఇండియన్ నేవీ కూడా ఎంతో శ్రమిస్తున్నది. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ టెగ్ గురువారం 297 మంది భారతీయులను సుడాన్ పోర్ట్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించింది.
ముంబై: అంతర్గత యుద్ధం జరుగుతున్న సుడాన్ నుంచి రెండో బ్యాచ్‌గా మరో 246 మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు (Indians evacuated). ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానంలో ముంబై చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా సుడాన్ ఆర్మీ, పారామిలటరీ దళం మధ్య భీకర పోరాటం జరుగుతున్నది. పరస్పర దాడుల్లో సుమారు 500 మంది పౌరులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారు. అంతర్గత యుద్ధం వల్ల సుడాన్లో చిక్కుకున్న భారతీయులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించి సురక్షితంగా భారత్‌కు చేర్చేందుకు ‘ఆపరేషన్ కావేరి’ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
కాగా, తొలుత సుడాన్ నుంచి వందలాది మంది భారతీయులను యుద్ధ నౌకల ద్వారా సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి భారత వాయుసేనకు చెందిన భారీ రవాణా విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్ ద్వారా గురువారం ముంబైకి తీసుకొచ్చారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆపరేషన్ కావేరీ మిషన్‌లో భాగంగా రెండో బ్యాచ్ కింద మరో 246 మంది భారతీయులు మరో విమానంలో దేశానికి తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే సుడాన్ నుంచి రక్షించిన 360 మంది భారతీయులతో కూడిన తొలి బ్యాచ్ మరో విమానంలో బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకుంది.
మరోవైపు, సుడాన్ నుంచి భారతీయల తరలింపులో ఇండియన్ నేవీ కూడా ఎంతో శ్రమిస్తున్నది. భారత నౌకా దళానికి చెందిన ఐఎన్ఎస్ టెగ్ గురువారం 297 మంది భారతీయులను సుడాన్ పోర్ట్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించింది. భారత యుద్ధ నౌకల ద్వారా జెడ్డాకు చేరిన భారతీయుల రెండో బ్యాచ్ ఇది. 278 మంది భారతీయులతో కూడిన తొలి బ్యాచ్ ఐఎన్ఎస్ సుమేధ ద్వారా బుధవారం జెడ్డాకు తరలించారు. అనంతరం వీరందరినీ జెడ్డా నుంచి రెండు విమానాల్లో భారత్‌కు చేర్చారు.
Another #OperationKaveri flight comes to Mumbai.
246 more Indians come back to the motherland. pic.twitter.com/So7dlKO0z6
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 27, 2023
#OperationKaveri continues in swift pace.
Happy to receive 297 Indians at Jeddah carried by INS Teg. With this second ship and total six batches, around 1100 Indians rescued from Sudan have arrived in Jeddah.
Repatriation to India of those arriving today will commence shortly. pic.twitter.com/krTteb121h
— V. Muraleedharan (@MOS_MEA) April 27, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

