తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 70,815 మంది భక్తులు దర్శించుకోగా 25,245 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi kanukalu) రూ. 3.16 కోట్లు వచ్చిందని వివరించారు.