Case register | ఓటరును చెంప దెబ్బ కొట్టిన తెనాలి ఎమ్మెల్యేపై కేసు నమోదు
Case register | ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో పోలింగ్ సందర్భంగా ఓటరుపై చేయిచేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి (Tenali) లో పోలింగ్ సందర్భంగా ఓటరు ( Voter) పై చేయిచేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) అన్నాబత్తుని శివకుమార్ (Shivakumar) పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
నిన్న తెనాలి ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఓటును వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిలబడ్డారు అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ దంపతులు ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకుని నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్తుండగా గొట్టిముక్కల సుధాకర్(Sudhakar) అనే ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. గంటల తరబడి తాము క్యూలైన్లో నిలబడితే నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడాన్ని ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే ఓటు వేసి వచ్చిన తరువాత గొట్టిముక్కల సుధాకర్ చెంపపై కొట్టడంతో బాధితుడు కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు.
దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు బాధితుడిపై ముకుమ్మడి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాకుండా మరోసారి బాధితుడిపైకి దాడి చేయడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు.
బాధితుడిపై దాడి వీడియో రాష్ట్రవ్యాప్తంగా కాకుండా జాతీయ ఛానళ్లలోనూ విస్తృతంగా ప్రచారం కావడంతో భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి ఎమ్మెల్యేను వెంటనే గృహ నిర్భందం చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని గృహనిర్భందం చేశారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు ఎమ్మెల్యేపై కే నమోదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

