Rajendra Prasad | టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ కామిక్ టైమింగ్ ఉన్న హీరోల్లో ముందువరుసలో ఉంటారు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad). నాలుగు దశాబ్దాలకుపైగా విభిన్న పాత్రలతో, కామిక్ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు నటకిరీటి. రాజేంద్రప్రసాద్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాల జాబితాలో టాప్‌లో ఉంటుంది ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఆ ఒక్కటి అడక్కు (Aa okkati Adakku) అంటూ చేసే కామెడీ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
చాలా రోజుల తర్వాత మళ్లీ అదే డైలాగ్ చెప్పాడు రాజేంద్రప్రసాద్. ఇంతకీ విషయమేంటనుకుంటున్నారా..? సోమవారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజేంద్రప్రసాద్ హైదరాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్‌లో ఈ డైలాగ్ వేశారు. రోల్ కెమెరా.. యాక్షన్.. అని అనగానే మరి ఓటు ఎవరికి వేశారని అడగలేదేంటి..? ఆ ఒక్కటి అడక్కు.. అని రిపోర్టర్లతో అంటూ రాజేంద్రప్రసాద్ తనదైన కామిక్ స్టైల్లో ఫన్నీగా చెప్పిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
“ఆ ఒక్కటి అడగకు”
-Rajendra Prasad-#actor #EleccionsParlament2024 #Tollywood pic.twitter.com/wqsfjuZXY0— Shareef (@shareef_journo) May 13, 2024