న్యూఢిల్లీ: ఢిల్లీలోని నాలుగు ఆస్పత్రులకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు కాల్స్(Bomb Threat) వచ్చాయి. కొన్ని రోజుల క్రితం అనేక స్కూళ్లకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీతో పాటు కొన్ని పెద్ద నగరాలకు కూడా ఇటీవల బెదిరింపు కాల్స్ వచ్చాయి. జీటీబీ హాస్పిటల్, దాదా దేవ్ హాస్పిటల్, హెగ్డేవర్ హాస్పిటల్, దీప్ చంద్ర బంధు హాస్పిటల్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ వెల్లడించింది. అయితే ఆ కాల్స్‌ను పరిశీలిస్తున్నట్లు ఫైర్ డిపార్ట్మెంట్ పేర్కొన్నది.