Schools reopen | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సమరం దేశ ప్రజానీకం ఆశించినవేవీ సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో వారం రోజులుగా ఉత్తర భారతదేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు సోమవారం చల్లబడ్డాయి. డ్రోన్లు, బాంబుల మోత లేకపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. దీంతో జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు ఇవాళ తెరుచుకున్నాయి (Schools reopen). సరిహద్దు ప్రాంతాలు మినహా జమ్మూ కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలు మంగళవారం తిరిగి తెరచుకున్నాయి.
#WATCH | Jammu & Kashmir | Schools have reopened in Srinagar after cessation of hostilities between India and Pakistan pic.twitter.com/bg9IwLZ5v0
— ANI (@ANI) May 13, 2025
నాలుగు రోజుల పాటు భారత్-పాక్‌ల మధ్య మిలటరీ చర్యలు కొనసాగగా.. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితి మారింది. ఆ తర్వాత సోమవారం సాయంత్రం కూడా ఇరు దేశాల డీజీఎంవోలు హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిపారు. సరిహద్దుల్లో బలగాలను తగ్గించేందుకు భారత్-పాకిస్థాన్‌లు అంగీకరించాయి. ఈ మేరకు రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్(డీజీఎంవో)లు నిర్ణయానికి వచ్చినట్టు ఇండియా టుడే వెల్లడించింది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపొద్దని.. దూకుడుగా వ్యవహరించొద్దని సోమవారం సాయంత్రం 5 గంటలకు హాట్‌లైన్ ద్వారా జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు ఓ ప్రకటన తెలిపింది.
పాకిస్థాన్ శనివారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించగా.. 19 రోజుల తర్వాత తొలిసారిగా ఆదివారం రాత్రి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఏప్రిల్ 23 నుంచి మే 6 వరకు ఎల్వోసీ వెంబడి తుపాకీల మోత వినిపించగా.. మే 7 నుంచి 11 వరకు డ్రోన్లు, వైమానిక దాడులతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. అయితే సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని సహించేది లేదని, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని సంబంధింత వర్గాలు పీటీఐకి తెలిపాయి.
Also Read..
Illicit Liquor: కల్తీ మద్యం సేవించి 15 మంది మృతి.. ఆరు మందికి తీవ్ర అస్వస్థత