న్యూఢిల్లీ, జనవరి 16: తనపై వచ్చిన దుష్ప్రవర్తన ఆరోపణలపై విచారణకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేయడానికి లోక్సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది.
రాజ్యసభ చైర్మన్ కూడా ఇదేవిధమైన పిటిషన్ను తిరస్కరించినప్పటికీ ప్యానెల్ ఏర్పాటు చేయడంలో లోక్సభ స్పీకర్ ఎలాంటి చట్టవిరుద్ధ చర్యకు పాల్పడ లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, సతీష్ చంద్రలతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ వర్మ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది.