ఇదేనా మీ వృత్తి నైపుణ్యం.. డిజిటల్ మోసాలపై బ్యాంకులకు సుప్రీం చీవాట్లు
డిజిటల్ అరెస్టు మోసం కేసులను పరిష్కరించడంలో బ్యాంకుల వృత్తి నైపుణ్యంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం ప్రకటించింది. కస్టమర్లు తమ జీవితకాల పొదుపు మొత్తాలను కోల్పోతున్నప్పటికీ అనుమానాస్పద లావాదేవీలను వెంటనే ఎందుకు అడ్డుకోవడం లేదని బ్యాంకులను సుప్రీంకోర్టు నిలదీసింది.
న్యూఢిల్లీ : డిజిటల్ అరెస్టు మోసం కేసులను పరిష్కరించడంలో బ్యాంకుల వృత్తి నైపుణ్యంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం ప్రకటించింది. కస్టమర్లు తమ జీవితకాల పొదుపు మొత్తాలను కోల్పోతున్నప్పటికీ అనుమానాస్పద లావాదేవీలను వెంటనే ఎందుకు అడ్డుకోవడం లేదని బ్యాంకులను సుప్రీంకోర్టు నిలదీసింది. అటువంటి మోసాలను ఎదుర్కొనడానికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర హోం శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ(మీటీ) దాఖలు చేసిన స్థాయీ నివేదికలను కేంద్రం సమర్పించిన సందర్భంగా ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం చేపట్టింది.
కేసులకు సంబంధించిన డాటాను క్రోడీకరించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ)ని సిద్ధం చేస్తున్నామని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. కస్టమర్లను రక్షించాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ ఏడాది జనవరి 2న రూపొందించిన ఎస్ఓపీని అధికారికంగా స్వీకరించి అమలు చేయాలని, చోరీ అయిన నిధులను పునరుద్ధరించడానికి ఇంటర్-ఏజెన్సీ సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రొసీజర్లను నిర్ధారించాలని హోం శాఖని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

