Health Tips | మైదాను వీటితో రీప్లేస్ చేస్తే అద్భుత ఫిజిక్ మీ సొంతం..!
ఆధునిక జీవనశైలి, అనారోగ్యకర ఆహార అలవాట్లతో (Health Tips) చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి వ్యాధుల ముప్పు ఎదుర్కొంటున్నారు.
న్యూఢిల్లీ : ఆధునిక జీవనశైలి, అనారోగ్యకర ఆహార అలవాట్లతో (Health Tips) చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి వ్యాధుల ముప్పు ఎదుర్కొంటున్నారు. మైదాతో నిండిన ఆహార పదార్ధాల వాడకం పెరగడం ఇందుకు ప్రధాన కారణమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భటూరా, పూరీలు, సమోసాలు, కేక్స్, బ్రౌనీస్ వంటి పలు స్నాక్స్, స్ట్రీట్ ఫుడ్‌లో రిఫైన్డ్ ఫ్లోర్ (మైదా) కలుపుతారు. మైదాతో ఆయా వంటకాలకు రుచి పెరిగినా దీర్ఘకాలంలో వ్యాధుల ముప్పు పొంచిఉంది. రిఫైన్డ్ ఫ్లోర్ అధికంగా ప్రాసెస్ చేయడంతో దానిలోని పోషకాలు కూడా తొలగిపోతాయి. దీంతో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవాలనుకునే వారికి ఈ ఆహారం మరింత చేటు చేస్తుంది. మైదాకు ప్రత్యామ్నాయంగా ఇతర పదార్ధాలను వాడటం ద్వారా ఆయా వంటకాలను టేస్టీగా, హెల్తీగా మలుచుకునే అవకాశం ఉంది.
మైదాకు ప్రత్యామ్నాయంగా హోల్ వీట్ ఫ్లోర్ (ఆటా) మెరుగైన ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. దీనికి ప్రాసెసింగ్ తక్కువ ఉండటంతో శరీరానికి అవసరమైన అత్యవసర పోషకాలు అలాగే ఉంటాయి. దీనికితోడు ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉండటంతో కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ తినకుండా ఉండేలా చేస్తుంది. ఇది బరువు తగ్గే డైట్లో ప్రత్యేకంగా తీసుకునేందుకు అనువుగా ఉంటుంది.
అలాగే ఓట్స్‌తో రోటీలు ఇతర ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా అధిక ప్రొటీన్, ఫైబర్ లభించడంతో పాటు ఆరోగ్యకర కొవ్వులు లభిస్తాయి. ఓట్స్‌తో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను కూడా తగ్గించుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక శనగ పిండి, సజ్జ పిండి, రాగి పిండి వంటి మిల్లెట్ ఫ్లోర్‌తో చేసిన ఆహార పదార్ధాలతో బరువు తగ్గడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు పొందవచ్చు.
Read More :
Woman Shoots Sister | భర్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం.. చెల్లిపై అక్క కాల్పులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

