RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
RC 17 | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై రోజుకో ఆసక్తికరమైన వార్త తెరపైకి వస్తోంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తికాగా, విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ మరింత ఆసక్తిని పెంచింది.
RC 17 | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై రోజుకో ఆసక్తికరమైన వార్త తెరపైకి వస్తోంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తికాగా, విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ మరింత ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ఈ సినిమా కథపై మరో ప్రచారం మొదలైంది. గుజరాతీలో సంచలనం సృష్టించిన ‘లాలో’ చిత్రానికి ఇది రీమేక్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సినిమా కథపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోస్టర్లో ఉపయోగించిన రంగులు, చిత్రీకరణ శైలి నేపథ్యంలో ఈ సినిమాలో పౌరాణిక అంశాలు ఉండబోతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా, గుజరాతీలో విడుదలై విజయం సాధించిన ‘లాలో’ (2025) సినిమాను తెలుగులో రామ్ చరణ్‌తో రీమేక్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్టే సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 17’ అని ప్రచారం మొదలైంది. దీంతో అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది. అయితే ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.
సుకుమార్ 2024 మార్చిలోనే రామ్ చరణ్‌తో తన తదుపరి సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచే ఈ చిత్ర కథపై ఆయన పని చేస్తున్నారు. ‘లాలో’ విడుదలకు ముందే ‘ఆర్సీ 17’ కథలోని కీలక భాగాన్ని సుకుమార్ సిద్ధం చేసినట్లు సమాచారం. అందువల్ల ఈ సినిమా గుజరాతీ చిత్రానికి రీమేక్ అనే ప్రచారానికి ఆధారం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు ‘లాలో’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ రీమేక్‌లో రామ్ చరణ్ నటించడం లేదని, మరో హీరో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ‘ఆర్సీ 17’ను ‘లాలో’ రీమేక్‌గా పేర్కొంటూ వస్తున్న వార్తలకు తెరపడినట్లయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- laalo
- ram charan
- RC 17
- remake
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

