Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Amitabh Bachchan | బాలీవుడ్లో వరుసగా చోటుచేసుకుంటున్న బెదిరింపులు, కాల్పుల ఘటనలు సినీ ప్రముఖుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతకాలంగా స్టార్ హీరోలను లక్ష్యంగా చేసుకుని గ్యాంగ్స్టర్ల నుంచి హెచ్చరికలు వస్తుండటంతో పలువురు నటీనటులు తమ భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకుంటున్నారు.
Amitabh Bachchan | బాలీవుడ్లో వరుసగా చోటుచేసుకుంటున్న బెదిరింపులు, కాల్పుల ఘటనలు సినీ ప్రముఖుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతకాలంగా స్టార్ హీరోలను లక్ష్యంగా చేసుకుని గ్యాంగ్స్టర్ల నుంచి హెచ్చరికలు వస్తుండటంతో పలువురు నటీనటులు తమ భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక నిలబడి అభిమానులకు అభివాదం చేయడం చర్చనీయాంశంగా మారింది. అమితాబ్ బచ్చన్ ప్రతి ఆదివారం అభిమానులను కలుసుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న అలవాటు. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం ‘జల్సా’ వద్దకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. ఇంటి బయటకు వచ్చిన బిగ్‌బీ వారికి అభివాదం చేస్తూ పలకరిస్తారు. అయితే ఈసారి మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపించాయి.
ఇటీవల ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన కాల్పుల ఘటనతో పాటు అమితాబ్ నివాసానికి వచ్చిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఆదివారం అభిమానులను పలకరించేందుకు వచ్చిన అమితాబ్ మూడు వైపులా రక్షణ కల్పించేలా ఏర్పాటు చేసిన భారీ పారదర్శక బుల్లెట్ ప్రూఫ్ అద్దం వెనుక నిలబడ్డారు. ఆయన పక్కనే కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ఉండి పరిసరాలను గమనించారు. భద్రతా పరిమితులు ఉన్నప్పటికీ అభిమానులను నిరాశపరచకుండా అమితాబ్ తన ఆదివారం సంప్రదాయాన్ని కొనసాగించారు. బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక నుంచే చేతులు ఊపుతూ అభిమానులకు అభివాదం చేశారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు వచ్చిన వారిలో ఈ దృశ్యం ఆసక్తితో పాటు ఆందోళనను కూడా కలిగించింది.
ఒకవైపు అభిమానుల ప్రేమను స్వీకరిస్తూనే, మరోవైపు భద్రతా జాగ్రత్తలు పాటిస్తూ అమితాబ్ కనిపించడం ప్రస్తుతం చర్చగా మారింది. దశాబ్దాలుగా అభిమానులతో కొనసాగిస్తున్న అనుబంధాన్ని ఆయన ఈ విధంగా మరోసారి చాటుకున్నారు. అయితే ఒకప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా అభిమానులను కలుసుకునే బిగ్‌బీ, ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ రక్షణ మధ్య కనిపించాల్సిన పరిస్థితి రావడంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
బులెట్ ప్రూఫ్ గ్లాస్ రక్షణలో #AmitabhBachchan ..
అమితాబ్ ప్రతి ఆదివారం తన ఇంటి వద్ద అభిమానులను కలుస్తారు..
ఇటీవల #TigerShroff పై జరిగిన కాల్పుల ఘటన తర్వాత, బిగ్ బి కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఉన్నారనే ప్రచారం జరిగింది.
అందుకే అమితాబ్ ప్రస్తుతం తన సెక్యూరిటీ నిమిత్తం ప్రొటెక్టివ్ గ్లాస్ లోపల నుంచే అభిమానులను కలుస్తున్నారు.
#BishnoiGang #Bulletproof #Security
— SZN (@Suzenbabu) November 1, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

