Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Plane Crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాస ప్రాంతానికి సమీపంలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Plane Crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాస ప్రాంతానికి సమీపంలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా స్థానిక కాలమాన ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం నేపథ్యంలో సమీప రహదారులను మూసివేశారు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వివరాల ప్రకారం.. లియర్‌జెట్ 60 విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి బహామాస్కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఫ్లోరిడాలోని క్రెస్ట్హేవెన్ ప్రాంతంలో నేలపైకి దూసుకొచ్చి కూలిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన మార్-ఎ-లాగో నివాసానికి ఈ ప్రాంతం సుమారు తొమ్మిది మైళ్ల దూరంలో ఉంది.
కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విమానం ఆకాశం నుంచి వేగంగా కిందికి దూసుకొచ్చి రహదారి సమీపంలో కూలిన వెంటనే భారీ పేలుడు సంభవించినట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఘటనాస్థలంలో దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపడింది. ఈ ప్రమాదంపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ స్పందించారు. విమానం కూలిన దృశ్యాలు చూస్తే అది క్షిపణిలా కిందికి దూసుకొచ్చినట్లు ఉందని, భారీ పేలుడుతో శకలాలు అన్ని వైపులా ఎగిరిపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
That’s unfortunate.
Business jet crashes in Green Acres Florida. Oooof. https://t.co/wICs34MuPn— William Munny (@Willy_Munny) November 2, 2026
ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని ట్రైలర్ పార్క్ కమ్యూనిటీ నుంచి సుమారు 600 మంది స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు బీబీసీ నివేదించింది. విమానం కూలిన ప్రభావంతో స్థానిక మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా నీటి సరఫరా పైపులైన్లు దెబ్బతిన్నట్లు వెల్లడించారు. సమీపంలోని ఇళ్లకు ఏమైనా నష్టం జరిగిందా అన్నది వెంటనే స్పష్టంకాలేదు.
ప్రమాదంపై దర్యాప్తు చేపట్టేందుకు FAA బృందాన్ని పంపుతున్నట్లు అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ తెలిపారు. జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB) దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పారు. ప్రమాదానికి గురైన విమానం రిజిస్ట్రేషన్ నంబర్ N722BD అని ఆస్టిన్ విమానాశ్రయ ప్రతినిధి జిమ్ రేనాల్డ్స్ ధ్రువీకరించారు. విమానంలో ప్రయాణిస్తున్న వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

