BRS | ముంబై, జనవరి 5 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో రైతులు, పేదలు, దళితుల కోసం పార్టీ పనిచేస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, పదాధికారులు పార్టీ విజయానికి నిజాయితీగా, అంకితభావంతో పనిచేస్తున్నారని వివరించారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పని చేస్తున్నదని, ఇతర పార్టీల మాదిరిగా తప్పుడు ప్రకటనలు చేయడం లేదని జల్గాం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ పాటిల్ తెలిపారు.