Sam Pitroda | దక్షిణాదివారు ఆఫ్రికా వాళ్లలా ఉంటారు.. కాంగ్రెస్ మేధావి అసంబద్ధ వ్యాఖ్య
దేశంలో ‘వారసత్వ పన్ను’ ఉండాలంటూ ఇటీవల దుమారం రేపిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆయన ఆఫ్రికన్లతో పోల్చారు.
- కాంగ్రెస్ నేత, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలు
- శ్వేతజాతీయుల్లా ఉత్తరాది వాళ్లు!
- ఎన్నికల వేళ రాజకీయ దుమారం
- పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్
- రాష్ట్రపతిని అవమానించారు: మోదీ
Sam Pitroda | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): దేశంలో ‘వారసత్వ పన్ను’ ఉండాలంటూ ఇటీవల దుమారం రేపిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆయన ఆఫ్రికన్లతో పోల్చారు. ఈ మేరకు ఇంగ్లిష్ వార్తాపత్రిక ‘ది స్టేట్స్‌మన్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల వేళ పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
’75 ఏండ్ల స్వతంత్య్ర భారతావనిలో మనమంతా కలిసి చక్కని వాతావరణంలో జీవిస్తున్నాం. మనది ఎంతో వైవిధ్యమైన దేశం. అక్కడక్కడ చిన్న కొట్లాటలు జరుగుతున్నా.. మనమంతా ఒక్కటే అనే భావనతో కలిసే ఉంటున్నాం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమవాసులు అరబ్బులుగా.. ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారు. ఎవరెలా ఉన్నా.. మనమంతాసోదరసోదరీమణులమే. భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటాం’ అని ఆయన అన్నారు.
వ్యాఖ్యలు దురదృష్టకరం: కాంగ్రెస్
పిట్రోడా వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. జాతివివక్షను సహించబోయేది లేదన్నారు. శరీర రంగు చూపించి అవమానిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమన్న పార్టీ.. వాటిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని చెప్పింది. పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.
పదవికి రాజీనామా
తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి పిట్రోడా రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీన్ని ఆమోదించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

