చెన్నై, ఆగస్టు 18: నటుడి నుంచి రాజకీయ నేతగా మారి అనూహ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా అయిన జోసెఫ్ విజయ్ 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆయన శత దినోత్సవ పాలన ఎలా ఉందో అయన సన్నిహిత సహచరుడు, మంత్రి ఆధవ్ అర్జున మీడియాతో పంచుకున్నారు. విజయ్ రోజుకు 18-20 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని, ఉదయం నాలుగు గంటలకే మంత్రులకు ఫోన్ చేసి సంబంధిత శాఖల పురోగతి తెలుసుకుంటున్నారని వెల్లడించారు. అలాంటి ముఖ్యమంత్రి ఉండటం తమ అదృష్టమని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు ప్రజలు ఇచ్చిన విజయంతోనే ఆయన సంతృపి ్తపడిపోకుండా ఏ శాఖలో ఏ సమస్యలు ఉన్నాయి? వాటిని తీర్చడానికి ఏం చేయాలి? అన్న అంశాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారన్నారు.
తమలో ఎంతమాత్రం అహంకారం లేదని, తాము ప్రజలకు సేవ చేయాలని మాత్రమే అనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విజయోత్సవాన్ని జరుపుకోవాలని ఎంతమాత్రం అనుకోని విజయ్ను ఒక ‘రాజకీయ యోగి’గా అభివర్ణించారు. ఆర్థిక లీకేజీలు అరికట్టడానికి, పాలనలో పారదర్శకతకు ఆయన కృషి చేస్తున్నారన్నారు. అలాగే అవినీతి కింది స్థాయి నుంచి పేరుకుపోయి ఉన్న విషయాన్ని ఆయన గుర్తించారని, దానిని తొలగించడానికి ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు.