Sachin Pilot | బీజేపీ హయాంలో రికార్డుస్ధాయి నిరుద్యోగం : సచిన్ పైలట్
Sachin Pilot : పదేండ్ల ఎన్డీయే ప్రభుత్వంలో రికార్డు స్ధాయిలో నిరుద్యోగం ఎందుకు వెంటాడుతోందనేది కాషాయ పాలకులు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ నిలదీశారు.
Sachin Pilot : పదేండ్ల ఎన్డీయే ప్రభుత్వంలో రికార్డు స్ధాయిలో నిరుద్యోగం ఎందుకు వెంటాడుతోందనేది కాషాయ పాలకులు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ నిలదీశారు. లోక్‌సభ ఎన్నికలు దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని ఇవి అభివృద్ధి, పురోగతి, సౌభ్రాతృత్వం అజెండాగా జరగాలని పైలట్ పేర్కొన్నారు. బీజేపీ అగ్ర నేతల ప్రకటనలు చూస్తుంటే బీజేపీ తొలి దశ పోలింగ్‌లో వెనకబడిందనేది స్పష్టంగా అర్ధమవుతోందని అన్నారు.
తమకు అందిన సమాచారం ప్రకారం ఎన్డీయే కంటే ఇండియా కూటమి ముందంజలో ఉందని తెలుస్తోందని చెప్పారు. కేరళలో 20 స్ధానాలకు గతంలో 19 స్ధానాల్లో తాము గెలుపొందామని, ఈసారి ఇండియా కూటమి 20 స్ధానాలూ క్లీన్‌స్వీప్ చేస్తుందని చెప్పారు. గతం కంటే అధిక మార్జిన్‌తో రాహుల్ గాంధీ వయనాద్ నుంచి గెలుపొందుతారని సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు.
జాతీయస్దాయిలో బీజేపీని ఢీకొట్టేది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలకు అర్ధమైందని అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ స్ధానాల సంఖ్య పెరుగుతుందని, విపక్ష ఇండియా కూటమి జూన్ 4న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు. తాము దేశ ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేస్తామని, ఈ దేశం అందరిదనీ అన్నారు. బీజేపీ అగ్రనేతల ప్రకటనలు చూస్తుంటే ఎన్నికల ఫలితాలపై వారికి భయం పట్టుకుందని తెలుస్తోందని చెప్పారు. కేరళలో యూడీఎఫ్ మొత్తం 20 స్ధానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు.
Read More :
Tammy Beaumont | బాయ్‌ఫ్రెండ్‌తో పెండ్లి.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఫొటోలు వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

