PM Modi | దేశంలో కరోనా కలకలం.. ప్రధానితో మీటింగ్‌కు ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి..!
PM Modi | దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గత కొన్నిరోజులుగా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో భేటీకి ముందు మంత్రులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టు (RT PCR test mandatory) చేయించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
PM Modi | దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గత కొన్నిరోజులుగా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7వేలు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో భేటీకి ముందు మంత్రులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టు (RT PCR test mandatory) చేయించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే నివేదిస్తోంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం (Health Ministry Of India).. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 306 మందికి పాజిటివ్‌గా తేలింది. కేరళలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 170 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గుజరాత్లో 114 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,121కు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 8,573 మంది మహమ్మారిబారి నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో ఆరు మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ఒకరు, కర్ణాటకలో ఇద్దరు, కేరళలో ముగ్గురు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 74కి ఎగబాకింది.
రాష్ట్రాల వారీగా కొవిడ్ కేసులు ఇలా..
కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 2,223 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ (1,223), ఢిల్లీ (757), పశ్చిమ బెంగాల్ (747), మహారాష్ట్ర (615), కర్ణాటక (459), ఉత్తరప్రదేశ్ (229), తమిళనాడు (204), రాజస్థాన్ (138), హర్యాణా (125), ఆంధ్రప్రదేశ్ (72), మధ్యప్రదేశ్ (65), ఛత్తీస్‌గఢ్ (48), బీహార్ (47), ఒడిశా (41), సిక్కిం (33), పంజాబ్ (33), తెలంగాణ (11), జార్ఖండ్ (10), పుదుచ్ఛేరి (10), జమ్ము కశ్మీర్లో తొమ్మిది, అస్సాం, గోవా రాష్ట్రాల్లో ఆరు చొప్పున, ఛండీగఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మూడు చొప్పున, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు కేసులు, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో కేసు యాక్టివ్‌గా ఉంది.
Also Read..
Corona Virus | దేశంలో 7,121కి పెరిగిన క్రియాశీల కేసులు.. 24 గంటల్లో ఆరుగురు మృతి
Looting | నిరసనల చాటున.. యాపిల్ స్టోర్‌ను లూటీ చేసిన దుండగులు.. Video
Los Angeles | లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న నిరసనలు.. కర్ఫ్యూ విధింపు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

