Los Angeles | లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న నిరసనలు.. కర్ఫ్యూ విధింపు
Los Angeles | ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) రగిలిపోతోంది.
Los Angeles | ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) రగిలిపోతోంది. శుక్రవారం లాస్ ఏంజెలెస్‌లో ఫెడరల్ అధికారులు జరిపిన దాడులతో నగరమంతా అట్టుడికిన సంగతి తెలిసిందే. వలసల పట్ల అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా వేలాదిగా జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు.
ఈ నిరసనల నేపథ్యంలో లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డౌన్‌టౌన్ (Downtown)లోని పలు ప్రాంతాల్లో పరిమిత కర్ఫ్యూ (Curfew) విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. అయితే, ఈ కర్ఫ్యూ నివాసితులకు, ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులకు వర్తించదని పేర్కొన్నారు.
అక్రమ వలసదారుల అరెస్ట్‌కు నిరసనగా గత వారాంతంలో లాస్ ఏంజిలిస్‌లో చెలరేగిన నిరసనలు అమెరికాలోని ఇతర నగరాలకు పాకాయి. అట్లాంటాలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ-ఐస్) కార్యాలయం ముందు పలువురు ఆందోళనకు దిగారు. అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆస్టిన్, న్యూయార్క్, షికాగో, సియాటెల్, డాలస్, కెంటకీ తదితర నగరాల్లో నిరసనకారులు ఐస్ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. మరోవైపు లాస్ ఏంజెలెస్‌లో జరుగుతున్న నిరసనలను అణచేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4 వేల మంది నేషనల్ గార్డ్ దళాలను, 700 మంది మెరైన్స్ను మోహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
నిరసనలెందుకంటే?
ఈ నెల 6న ఐస్ ఏజెంట్లు లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారుల ఏరివేత కోసం దాడులు నిర్వహించడంతో వారికి మద్దతుగా వలసదారుల నిరసనలు ప్రారంభమయ్యాయి. తర్వాతి రోజు పలు హోమ్ డిపార్ట్మెంట్ స్టోర్లలో ఐస్ సోదాలు జరిపింది. లాటిన్ దేశాల వలసదారుల కోసం ఐస్ ఏజెంట్లు సోదాలు చేశారని నిరసనకారులు ఆరోపించారు. సాయంత్రానికల్లా వందలాది మంది నిరసనకారులు ఫెడరల్ భవనం బయట గుమికూడి ర్యాలీ నిర్వహించారు. కాలిఫోర్నియా సర్వీస్ ఎంప్లాయిస్ ఇంటర్నేషనల్ యూనియన్ అధ్యక్షుడితో సహా వంద మందినిపైగా పోలీసులు అరెస్ట్ చేయడంతో జూన్ 7 నుంచి నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. లాస్ఏంజెలెస్లోని డౌన్‌టౌన్ నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది. దీంతో తాజాగా అక్కడ పరిమిత కర్ఫ్యూ విధిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
Also Read..
Los Angeles | లాస్ ఏంజిలిస్ టు షికాగో.. యాంటీ ఐస్ నిరసనలు తీవ్రం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

