చుంచుపల్లి, ఆగస్టు 18 : గౌతమ్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్ఓలు పద్మ, ఈశ్వరి, శివలీల, మస్తాన్‌ను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సపావత్ కళ్యాణి, ఉప సర్పంచ్ గంగారం, పంచాయతీ కార్యదర్శి షర్మిల పూలమాలలు, శాలువాలతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంలో బీఎల్ఓలు బాధ్యతాయుతంగా పనిచేసి సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ఆరోగ్య కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.