Congress | ఎలక్షన్ కమిషన్ నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించింది : టీపీసీసీ చీఫ్
Congress | ఓటర్ల జాబితా (Voters) ప్రత్యేక సమగ్ర సవరణ (List Special Intensive Revision) పేరుతో ఎన్నికల సంఘం (Election Commision) తెలంగాణలో నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు (TPCC chief) మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు.
Congress : ఓటర్ల జాబితా (Voters) ప్రత్యేక సమగ్ర సవరణ (List Special Intensive Revision) పేరుతో ఎన్నికల సంఘం (Election Commision) తెలంగాణలో నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు (TPCC chief) మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. సర్ ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో గాంధీభవన్ (Gandhi Bhavan) లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడారు.
హైదరాబాద్ నగరంలో బీఎల్వోలు ఎవరి ఇంటికీ వెళ్లలేదని ఆరోపించారు. పేదలు, వలస కూలీల ఓట్లనే ఎక్కువగా తొలగించారని విమర్శించారు. 2002 నాటి ఓటర్ల జాబితా ఎంతమందికి అందుబాటులో ఉందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలాగే ఎన్నికల సంఘాన్ని కూడా తన జేబు సంస్థగా మార్చుకుందని చెప్పారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ముడిపెట్టకుండా పౌరులకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అకారణంగా 73 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందన్నారు.
మొత్తంగా 92 లక్షల ఓట్లను ఈసీ ప్రశ్నార్థకం చేసిందని అన్నారు. డీలిమిటేషన్, పోలింగ్ కేంద్రాల మార్పువల్ల 2002 నాటి వివరాలు సరిగా లేవని చెప్పారు. లక్షల మంది ఓట్లు తొలగించి ప్రజాస్వామ్య దేశమంటే ఎలా..? అని మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

