Vikas Sinha | యూఎస్ వర్సిటీకి రూ.190 కోట్ల విరాళం.. తెలుగు దంపతులు వికాస్ సిన్హా-అనురాధ దాతృత్వం
అమెరికాలో స్థిరపడ్డ తెలుగు దంపతులు వికాస్ సిన్హా-అనురాధ దంపతులు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తెలుగు మూలాలున్న వీరు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌కు 20 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.190 కోట్లు) విరాళంగా అందజేశారు. వికాస్ సిన్హా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉండే కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. 1984-88లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు.
- తెలుగు దంపతులు వికాస్ సిన్హా-అనురాధ దాతృత్వం
న్యూయార్క్ : అమెరికాలో స్థిరపడ్డ తెలుగు దంపతులు వికాస్ సిన్హా-అనురాధ దంపతులు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తెలుగు మూలాలున్న వీరు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌కు 20 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.190 కోట్లు) విరాళంగా అందజేశారు. వికాస్ సిన్హా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉండే కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. 1984-88లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు.
అక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత ఉద్యోగం చేస్తూ యూఎస్‌లోనే స్థిరపడ్డారు. టెక్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన సిన్హా.. ప్రస్తుతం బ్రాడ్‌కామ్ కంపెనీలో మెయిన్ ఫ్రేమ్ సాఫ్ట్వేర్ విభాగానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. దాంతో పాటు యూఎస్టీ కాలేజీలో ఇన్ఫర్మేషన్ లీడర్షిప్ బోర్డులోనూ సేవలందిస్తున్నారు. ఇదే యూనివర్సిటీకి ఈ దంపతులు గతంలోనూ విరాళం అందించారు. వీళ్లు అందజేసిన విరాళాలతో ఏఐ, అడ్వాన్స్డ్ అనలటిక్స్ కాలేజీలో నాణ్యమైన విద్యతో పాటు పరిశోధనలను విస్తరిస్తామని వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సహాయానికి గుర్తుగా ఏఐ విభాగానికి అనురాధ-వికాస్ సిన్హా పేర్లు పెడుతామని వర్సిటీ ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- anuradha
- Donation
- UNT
- Vikas Sinha
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

