న్యూఢిల్లీ : ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటన..ఆత్మాహుతి దాడిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. కారు లోపలి నుంచి ఉమర్ నబీ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నది. భారత రాజ్యానికి ఎర్రకోట ఒక ప్రతీకగా నిలుస్తుండటమే ఉగ్రవాదులు ఈ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. ఎన్ఐఏ తాజాగా 7,500 పేజీలతో చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది.
దీని ప్రకారం, గత ఏడాది నవంబర్ 10న ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వృత్తిరీత్యా వైద్యుడు, ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న ఉమర్ నీబీ, తీవ్రవాద భావజాలం గల వ్యక్తులతో నెట్వర్క్ నిర్మించడానికి 2022 నుంచి పనిచేస్తున్నాడని దర్యాప్తులో తేలింది.