Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 5న కేసు నమోదైంది.
ఎఫ్ఐఆర్లో మన్నె క్రిశాంక్, ‘ఎంఆర్ మీడియా తెలంగాణ’తోపాటు ఇతరులను నిందితులుగా పేర్కొన్నారు. BNSలోని 353(2), 352 సెక్షన్లకింద కేసు నమోదు చేశారు.
రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణలను ప్రశ్నిస్తూ మన్నె క్రిశాంక్ చేసిన వ్యాఖ్యలు, ప్రచురించిన అంశాలపై కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.