Mecca Joint Defence Agreement: సౌదీకి దళాలను పంపనున్న పాక్, టర్కీ
Mecca Joint Defence Agreement: సౌదీ అరేబియాకు ప్రత్యేక బలగాలను పంపేందుకు పాకిస్తాన్, టర్కీ దేశాలు అంగీకరించాయి. దీని కోసం మక్కా సంయుక్త రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యెమెన్‌లోని హౌతీలు సౌదీపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ దాడుల్ని ఎదుర్కొనేందుకు దళాలు సిద్ధం అవుతున్నాయి.
రియాద్: యెమెన్‌లోని హౌతీలు.. సౌదీపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో కీలక ఒప్పందం జరిగింది. సౌదీ అరేబియాకు ప్రత్యేక బలగాలను పంపేందుకు పాకిస్తాన్, టర్కీ దేశాలు అంగీకరించాయి. దీని కోసం మక్కా సంయుక్త రక్షణ ఒప్పందాన్ని(Mecca Joint Defence Agreement) కుదుర్చుకున్నాయి. రియాద్‌లో సోమవారం జరిగిన అత్యవసర సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్డించారు. మూడు దేశాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, డిప్యూటీ పీఎం ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆ మీటింగ్‌కు హాజరయ్యారు. సౌదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడినా, దాన్ని తిప్పికొడుతామని మూడు దేశాలు ఐక్యంగా ప్రకటన చేశాయి.
మూడు దేశాల అగ్రిమెంట్ ప్రకారం.. ఏ దేశంపై అటాక్ జరిగినా, మిగితా దేశాలు ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకోవాలని గత ఆగస్టులోనే ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నాటో గ్రూపులో అత్యధిక సైన్యం కలిగిన టర్కీతో పాటు, అణ్వాయుధ దేశం పాకిస్థాన్, గల్ఫ్‌లో కీలక దేశం సౌదీ అరేబియా ఒక్కటైనట్లు నిపుణులు చెబుతున్నారు. తాజా ఒప్పందం ప్రకారం తక్షణమే సౌదీ అరేబియాకు దళాలను పంపేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్లు ఇటీవల సౌదీపై దాడుల్ని పెంచారు. సౌదీ సిటీలను, ఇంధన కేంద్రాలను, షిప్పింగ్ మార్గాలను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో సైనికుల్ని పంపిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

