హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్సీఏ సీనియర్ మెన్స్ సూపర్ లీగ్ టోర్నీలో సబావెత్ లోక్నాథ్ నాయక్ (130) శతకంతో మెరిశాడు. సీనియర్ మెన్స్-డీ జట్టుతో మ్యాచ్లో మెన్స్-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన లోక్నాథ్ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో సత్తా చాటాడు.
దాంతో తొలి ఇన్నింగ్స్లో ‘ఏ’ టీమ్ 83 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెటరన్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (194) భారీ శతకంతో ‘డీ’ జట్టు రెండో రోజు చివరకు 416/7 స్కోరుతో నిలిచింది.