చెన్నై, సెప్టెంబర్ 9: తమిళనాట టీవీకే విజయ్-కాంగ్రెస్ పార్టీ కూటమికి పేరు ఖరారైంది. ఇక నుంచి తమ కూటమిని ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ’ పేరుతో పిలువబోతున్నట్టు కూటమిలోని ప్రధాన పార్టీల నాయకులు బుధవారం సంయుక్తంగా ప్రకటించారు.
చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో సీఎం విజయ్ సమక్షంలో జరిగిన సమావేశానికి వీసీకే, ఎండీఎంకే, కాంగ్రెస్, ఐయూఎంఎల్ పార్టీల నుంచి పలువురు నాయకులు హాజరు కాగా..కూటమి పేరును ప్రకటించారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలైన వామపక్షాలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.