Constitutions Preamble: రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు.. ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ విమర్శలు
Constitutions Preamble : ఎమర్జెన్సీ సమయంలో సామ్యవాదం, లౌకికవాదం పదాలను రాజ్యాంగ పీఠికలో జోడించినట్లు ఆర్ఎస్ఎస్ ఆరోపించింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆ పదాలు లేవని పేర్కొన్నది. ఆర్ఎస్ఎస్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది.
న్యూఢిల్లీ: బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పీఠక(Constitutions Preamble)లో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని ఆర్ఎస్ఎస్ వాదిస్తున్నది. దీనిపై సమీక్ష చేపట్టాలని ఆ సంస్థ కోరింది. ఎమర్జెన్సీ సమయంలో సామ్యవాదం, లౌకికవాదం పదాలను జోడించినట్లు ఆరోపించింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆ పదాలు లేవని పేర్కొన్నది. ఆర్ఎస్ఎస్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ ఎప్పటికీ అంగీకరించడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలన్న ఆలోచనలో ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది.
భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ ఆమోదించడం లేదని కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ పేర్కొన్నారు. 1949, నవంబర్ 30 నుంచి అంబేద్కర్, నెహ్రూలపై ఆర్ఎస్ఎస్ దాడి చేస్తూనే ఉందనన్నారు. కొత్త రాజ్యాంగాన్ని రాయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు.
आरएसएस ने कभी भी भारत के संविधान को पूरी तरह स्वीकार नहीं किया। 30 नवंबर 1949 से ही उसने डॉ. अंबेडकर, नेहरू और संविधान निर्माण से जुड़े अन्य लोगों पर हमले किए। स्वयं आरएसएस के शब्दों में, यह संविधान मनुस्मृति से प्रेरित नहीं था।
आरएसएस और बीजेपी ने बार-बार नए संविधान की मांग… pic.twitter.com/NLhH6IbpFO
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 27, 2025
రాజ్యాంగ పీఠికలో మార్పులు చేయాలని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబ్లే డిమాండ్ చేస్తున్నారని, సోషలిస్టు.. సెక్యూర్టీ పదాలను పీఠిక నుంచి తొలగించారన్నారని, బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారని, ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రణాళికే ఇది అని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది.
The RSS has NEVER accepted the Constitution of India. It attacked Dr. Ambedkar, Nehru, and others involved in its framing from Nov 30, 1949 onwards. In the RSS’s own words, the Constitution was not inspired by Manusmriti.
The RSS and the BJP have repeatedly given the call for a… pic.twitter.com/WP07XV7MuA
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 27, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

