RSP MP : లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీ చేస్తామని ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమ్చందన్ పేర్కొన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై విపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునేందుకు ముందుకొస్తే తాము పోటీపై పునరాలోచిస్తామని చెప్పారు.
ప్రభుత్వం మొండివైఖరితో వెళితే తాము తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గత పదేండ్ల బీజేపీ పాలనలో రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్ధలను నిర్వీర్యం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ మార్పుకు కాషాయ పాలకులు గట్టి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగ మార్పులను విపక్షం ఐక్యంగా ఎదుర్కొని నిలువరిస్తుందని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు తాము కలిసికట్టుగా పోరాడతామని తెలిపారు. దేశ లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించాల్సిన అవసరం ఉందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు, సిద్ధాంతాలను పరిరక్షించుకోవాలని ప్రేమ్‌చంద్రన్ పిలుపు ఇచ్చారు.
Read More :
Begumpet Airport | బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు