Begumpet Airport | బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు
Begumpet Airport | హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి (Begumpet Airport) బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
Begumpet Airport | హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి (Begumpet Airport) బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆగంతకుల మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఆకతాయిలు పనిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెయిల్ ఐడీ ఆధారంగా ఆగంతకులను గుర్తించే పనిలో పడ్డారు.
కాగా, గత కొన్ని రోజులుగా దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పలు పాఠశాలలు, విమానాలు, కార్యాలయాలు, రాజకీయ నాయకులకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. మొన్నటికి మొన్న దేశంలోని సుమారు 41 విమానాశ్రయాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే, బెదిరింపుల నేపథ్యంలో చేపట్టిన తనఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. పైగా ఆ బెదిరింపులన్నీ బూటకమని పోలీసులు గుర్తించారు.
Also Read..
MLA Sanjay Kumar | ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
IAS Transfers | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి
Job Mela | హుస్నాబాద్‌లో జాబ్‌మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

