చెన్నై: గత అయిదేండ్లలో దేశ వ్యాప్తంగా సుమారు రూ.900 కోట్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగమైనట్టు సామాజిక ఆడిట్లో తేలింది. తమిళనాడులో ఎక్కువగా ఈ అయిదేండ్లలో రూ.60.79 కోట్లు దుర్వినియోగం కాగా.. అధికారులు రూ.24.43 కోట్లు రికవరీ చేయగలిగారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో 2024-25లో రూ.7.11 కోట్ల నిధులు దుర్వినియోగం కాగా.. అధికారులు కేవలం రూ.16.31 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగారు.
పారదర్శకత, ప్రజలకు జవాబుదారీగా ఉండటం కోసం ఈ పథకంలో సామాజిక ఆడిట్ నిర్వహించడం పరిపాటి. ఈ ఆడిట్ పరిధిలోకి వస్తున్న పంచాయితీల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం’ అని ఓ అధికారి తెలిపారు. 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో 28 రాష్ర్టాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.889.19 కోట్ల ఆర్థిక అవకతవకలకు సంబంధించి 6,15,840 కేసులు నమోదయ్యాయి. రూ.110. 87 కోట్లు రికవరీ చేయగలిగారు.