Fashion Launches @ 2025 | 2025.. ఏడాది ముగింపుకు చేరుకుంది. మరో 15 రోజుల్లో 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ ఏడాదిలో ఎన్నో ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, విషాదాలు వెలుగుచూశాయి. వాటితోపాటూ కొన్ని వింతలు కూడా చోటుచేసుకున్నాయి. అందులో పలు వస్తువులు ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. ఆ వింతల్లో ముందుగా చెప్పుకోవాల్సింది Safety Pin సెఫ్టీ పిన్ (పిన్నీసు) గురించే.
కొనే వారు ఉండాలే కానీ తల వెంట్రుకను కూడా వేలల్లో అమ్మే సంస్థలకు ఈ ప్రపంచంలో లోటు లేదు. కొబ్బరి చిప్పను వేలల్లో అమ్మినా, లో దుస్తులకి లక్షల ధర పలికినా అదంతా ఆన్లైన్ మార్కెటింగ్ (Online Marketing) మాయాజాలం. ఆ తరహాలో ఈ ఏడాది కొన్ని వస్తువులు ఫ్యాషన్ ప్రియులను నోరెళ్లబెట్టేలా చేశాయి. అందులో సెఫ్టీ పిన్ ఒకటి.
సాధారణంగా మనం 10 రూపాయలో 20 రూపాయలో ఏడాదికి సరిపడినన్ని పిన్నీసులు తీసుకుంటాము. కానీ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా (Prada) ‘సేఫ్టీ-పిన్-బ్రూచ్’ పేరుతో ఒక సేఫ్టీ పిన్ (Safety Pin)ను విడుదల చేసింది. దీని ధర అక్షరాలా రూ.68,758. ఒక సాధారణ వస్తువును అధిక ధరతో లగ్జరీ ఫార్మాట్‌తో విడుదల చేయడంతో సామాజిక మాధ్యమంలో విపరీత స్పందనలు వచ్చాయి. ఇది లేత నీలం, గులాబీ, నారింజ రంగులలో లభిస్తుంది. దీనికి ఒక్కసారే కొనలేని వారికి ఈఎంఐ సౌకర్యం కూడా అందజేయడం మరో విశేషం. ఇది చూసిన నెటిజన్లు సేఫ్టీ పిన్‌కు ఇంత ధరనా అని నోరెళ్లబెట్టారు.
[Part 1/2]
When luxury meets minimalism — @Prada turns a humble safety pin into a ₹69,000 fashion statement. 💫It’s not just a brooch; it’s a conversation starter on what defines style and value today. pic.twitter.com/3Hngqxxbzg
— Fortune India (@FortuneIndia) November 6, 2025
బ్యాగుల్లో తోపు కంపెనీ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది లూయిస్ విట్టన్ (Louis Vuitton) బ్రాండే. దీని గురించి తెలియనివారు ఉండరు. ఫ్యాషన్ ప్రియులకు ఈ బ్రాండ్ గురించి పరిచయమే అక్కర్లేదు. ఫ్యాషనబుల్ లగ్జరీ హ్యాండ్ బ్యాగుల్ని రూపొందించి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది ఈ సంస్థ. ఈ ఏడాది సరికొత్త బ్యాగ్‌ను పరిచయం చేసింది. రిక్షా ఆకారంలో (Auto Bag) సంస్థ లాంచ్ చేసిన ఓ లగ్జరీ బ్యాగ్ నెట్టింట తెగ సందడి చేసింది. ఇండియన్ నగర రోడ్లలో తిరిగే ఆటోరిక్షా ఆకారంలో వచ్చిన ఈ హ్యాండ్‌బ్యాగ్ ధర అక్షరాలా రూ.35 లక్షలు. లూయిస్ విట్టన్ సిగ్నేచర్ మోనోగ్రామ్ కాన్వాస్‌తో బుల్లి చక్రాలు (ఇవి పనిచేస్తాయి కూడా) హ్యాండిల్‌బార్.. ఇలా అచ్చం ఆటోలాగానే దీన్ని రూపొందించారు. ఇది ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ ప్రాడా (Prada) ఈ ఏడాది ప్రదర్వించిన చెప్పులు, వాటి ధర కూడా హాట్ టాపిక్ అయ్యింది. స్ప్రింగ్ సమ్మర్ 2026లో భాగంగా ప్రాడా పురుషులకు చెందిన పాదరక్షలను ప్రదర్శించింది. ఇవి అచ్చం భారత్‌లోని కొల్హాపురిలో తయారైన చెప్పులు (Kolhapuri chappals) లాగానే ఉన్నాయి. కొల్హాపురి చెప్పుల బ్రాండ్‌ను కాపీ కొట్టి అదే తరహా చెప్పులను తయారు చేసి భారీ ధరకు సేల్ పెట్టింది. సేమ్ డిజైన్‌తో అలాంటి చెప్పులు మన వద్ద రూ.400 వరకు ఉంటాయి. కానీ ప్రాడా మాత్రం ఆ చెప్పుల ధరను ఏకంగా రూ.1.2లక్షలుగా పేర్కొంది. ఈ వ్యవహారం హాట్‌టాపిక్ అయ్యింది. ప్రాడాపై విమర్శలు కూడా వచ్చాయి.
అదే సమయంలో పలువురు ప్రముఖులు సైతం ప్రాడాపై మండిపడ్డారు. ఈ బ్రాండ్ తమదని, డిజైన్‌ను కాపీ కొట్టి అమ్మకాలు సాగించడం అన్యాయమని, తమకు కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని భారత్‌కు చెందిన పలువురు అభ్యంతరం చెప్పారు. గ్లోబల్ బ్రాండ్లు మన సంస్కృతిని సొమ్ము చేసుకుంటున్నాయంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంక (Harsh Goenka) సైతం మండిపడ్డారు. దీంతో చివరికి ప్రాడా తన తప్పును అంగీకరించింది. అయినప్పటికీ కొందరు ప్రాడాపై కోర్టుకెక్కారు. కొల్హాపురి చేతివృత్తుల వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court)లో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.
Prada is selling products looking like Kolhapuri chappals for over ₹1 lakh. Our artisans make the same by hand for ₹400. They lose, while global brands cash in on our culture. Sad! pic.twitter.com/Cct4vOimKs
— Harsh Goenka (@hvgoenka) June 26, 2025
Also Read..
Air Pollution | తీవ్ర కాలుష్యం.. నగరాన్ని వీడి హిల్ స్టేట్‌కు క్యూకడుతున్న ఢిల్లీ వాసులు..? VIDEO
Bharat Taxi | ఓలా, ఉబర్‌కు పోటీగా.. భారత్ ట్యాక్సీ వచ్చేస్తోంది
PM Modi | సొంతింట్లో ఉన్న భావన కలుగుతోంది.. ఇథియోపియా పార్లమెంట్లో ప్రసంగించిన ప్రధాని మోదీ