ఇచ్చోడ, ఫిబ్రవరి 10: రాజస్థాన్‌కు చెం దిన గొర్రెల కాపరులు 500 గొర్రెలను అనుమతి లేకుండా ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మ టైగర్ జోన్లో మేపారు. దీంతో గొర్రెల కాపరులకు రూ.10 లక్షల జరిమానా విధించినట్టు సిరిచెల్మ టైగర్ జోన్ ఎఫ్ఆర్వో నాగస్వామి మంగళవారం తెలిపారు. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో పశువులను మేపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.